Telangana RTC | శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
Telangana RTC | శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
- శివ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసీ ఆర్టీసీ యాజమాన్యం
శుభకార్యాలకు అద్దెకు తీసుకునే బస్సు ఛార్జీలు తగ్గింపు
Hyderabad : రాష్ట్రంలో శివ భక్తుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. డిసెంబర్ 1 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఎండి సీ సజ్జనార్ శనివారం తెలిపారు. రాష్ట్రంలోన ప్రధాన శైవ క్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, కీసరతో పాటు శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. అయితే ప్రత్యేక బస్సుల రిజర్వేషన్ల కోసం tgsrtcbus.in అనే వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. అలాగే శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన నడిపై బస్సులకు ఛార్జీలు తగ్గిస్తామని పేర్కొన్నారు. పల్లెవెలుగు కిలోమీటర్‌కు రూ.11, ఎక్స్ ప్రెస్‌కు రూ.7, డీలక్స్‌కు రూ.8, సూపర్ లగ్జరికీ రూ.6, రాజధానికి రూ.7 వరకు చార్జీలు తగ్గించినట్లు ఆర్‌టీసీ ఎండి తెలిపారు.
* * *
Leave A Comment